కరోనా కష్టాలు మహానటికే తప్పడం లేదు!!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. ఎంతలా అంటే అసలు కరోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్‌లు త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. సినిమా థియేటర్స్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోవాలనుకోవడంపై ఓ క్లారిటీ లేదు. దీంతో చిన్న నిర్మాతలు సినిమాలను డిజిటల్ మీడియాల్లో విడుదల చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే హీరో సూర్య సహా మరి కొంతమంది తాము నిర్మించిన సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న కీర్తి సురేశ్ నటించిన సినిమాకే థియేటర్స్ సమస్య తప్పేలా లేదు. కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన చిత్రం పెంగ్విన్. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో కరోనా ఎఫెక్ట్ రావడంతో సినిమా విడుదల ఆగింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో పెంగ్విన్ సినిమా విడుదలవుతుందట. జూన్‌లో పెంగ్విన్ అమెజాన్‌లో ప్రసారమవుతుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout