2021కి 25 కోట్ల మందికి కరోనా.. 18 లక్షల మరణాలు: ఎంఐటీ
- IndiaGlitz, [Wednesday,July 08 2020]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి పది లక్షల మంది కరోనా బారిన పడగా.. ఐదున్నర లక్షల మంది మృతి చెందారు. అయితే ఇది ఇప్పటితో ఆగదని 2021 నాటికి 25 కోట్లకు చేరుతుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు తెలిపారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగనుందని.. దాదాపు 18 లక్షల మంది కరోనాతో మరణించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం వల్లనే సాధ్యమని తెలిపారు. మార్చి నుంచే కరోనా టెస్టులు నిర్వహించి.. అవసరమై జాగ్రత్తలు పాటించి ఉంటే కేసుల సంఖ్య తగ్గి ఉండేదని ఎంఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు.