కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తొలుత ఆయన లాయర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో బిషప్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. అనంతరం టెస్టుల్లో తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో బిషప్.. కొట్టాయమ్‌లో కోర్టుకు సరిగా హాజరు కావడం లేదు. జూలై 1న కోర్టు విచారణకు సైతం హాజరు కాలేదు. పైగా తాను నివసిస్తున్న పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉందని కోర్టుకు రాలేనని తెలిపారు.

అయితే అసలు జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లోనే లేదని.. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. వారెంట్ జారీ అయిన కొద్ది సేపటికే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

More News

ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్.. కేర్‌కు తరలింపు

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఇటీవల సడలింపులివ్వడంతో ప్రమాదాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

చిరు 153 డైరెక్టర్ మారుతున్నాడా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’చిత్రీకరణను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ చేతుల మీదుగా 'సెబాస్టియ‌న్ P.C. 524' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

రాజావారు రాణిగారు" చిత్రంతో చిత్ర సీమ‌కు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క‌మిట్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు

ఇది ఫుల్లీ రొమాంటిక్  'డర్టీ హరి'

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెర‌కు  పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు .