కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..
- IndiaGlitz, [Thursday,July 16 2020]
బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తొలుత ఆయన లాయర్‌కు కరోనా నిర్ధారణ కావడంతో బిషప్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అనంతరం టెస్టుల్లో తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో బిషప్.. కొట్టాయమ్‌లో కోర్టుకు సరిగా హాజరు కావడం లేదు. జూలై 1న కోర్టు విచారణకు సైతం హాజరు కాలేదు. పైగా తాను నివసిస్తున్న పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందని కోర్టుకు రాలేనని తెలిపారు.
అయితే అసలు జలంధర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లోనే లేదని.. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. వారెంట్ జారీ అయిన కొద్ది సేపటికే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.