యూకే నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు..
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని కాస్త ఫ్రీ అయిపోయిన జనాలకు కొత్తరకం వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బ్రిటన్‌లో ఈ వైరస్ బయటపడటంతో ప్రపంచ దేశాలన్నీ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో నిమగ్నమయ్యాయి. మంగళవారం ఉదయం యూకే నుంచి ముంబయి చేరుకున్న ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. కోవిడ్ లక్షణాలు లేని వారిని హోటల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు.. లక్షణాలున్న వారిని ముంబయిలోని జీటీ ఆసుపత్రికి తరలిస్తామని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెల్లడించారు.
కాగా.. యూకే నుంచి చెన్నై వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి యూకే నుంచి వయా ఢిల్లీ టు చెన్నై చేరుకున్నారని తెలియడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. ఒక వైపు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూనే మరోవైపు ఆ వ్యక్తిలో బయటపడిన వైరస్ కొత్త రకానిదా? కాదా? అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. కాగా.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్, బ్రిటన్ మధ్య నడిచే విమానాలను ఈ నెల 31 వరకూ రద్దు చేస్తున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రకటించింది.
యూకే నుంచి ఢిల్లీకి చేరుకున్న ఐదుగురికి కరోనా..
కాగా.. సోమవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కలకలం మొదలైంది. వెంటనే అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. బ్రిటీష్ ఎయిర్ ఇండియా విమానంలో సదరు ప్రయాణికులతో పాటు ప్రయాణించిన ప్రయాణికుల నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపించారు. కాగా.. వారి ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో యూకే నుంచి వచ్చిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments