హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు..!

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

దక్షిణాది అందాల నటి.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి శ్రియ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లయిన తర్వాత స్పెయిన్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో స్పెయిన్ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతోంది. ఇప్పటికే చాలా మందే అక్కడ మృత్యువాత పడ్డారు. అయితే తాజాగా.. తన భర్త ఆండ్రూ కొచీవ్‌లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని శ్రియ స్వయంగా వెల్లడించింది.

ప్రస్తుతానికి ఓకే..

‘నా భర్త పొడి దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతూ ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి, ప్రత్యేక గదిలో ఉంటున్నాడు. నా భర్తలో ఈ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రస్తుతానికి ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలూ లేవు. ఒకవేళ ఎదురైతే ఆండ్రూను ఆసుపత్రికి తరలిస్తాం’ అని శ్రీయ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఇటీవలే లాక్ డౌన్ సమయంలో తన భర్తతో తాను చాలా ఆనందంగా ఉన్నానని ఆమె చెప్పగా.. శ్రియ తనను బాగా ఇబ్బంది పెడుతోందని సోషల్ వీరిద్దరూ హడావుడి చేసిన విషయం విదితమే.

More News

మ‌హేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు..?

సినిమా మాధ్య‌మంకు స‌మాంతరంగా ఎదుగుతుంది డిజిట‌ల్ మాధ్య‌మం. అమెజాన్‌, హాట్ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి టాప్ డిజిట‌ల్ మాధ్య‌మాలే కాకుండా మ‌రిన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్

బాల‌య్య 106 ప్లాన్ అదేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన

పవన్ ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి..?

పవర్‌స్టార్‌, జ‌న‌సేనాని రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌సాబ్‌’. ముందుగా ఈ చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ భావించారు.

స‌మంత వంట గురించి అమ‌ల ఏమ‌న్నారంటే..?

టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో స‌మంత అక్కినేని ఒక‌రు. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే అక్కినేని నాగ‌చైత‌న్య‌త‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్ద‌రూ 2017లో పెళ్లి చేసుకున్నారు.

భారీ రెమ్యున‌రేష‌న్ అడిగిన ర‌మ్య‌కృష్ణ‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి