టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు.. గోప్యంగా..!

  • IndiaGlitz, [Monday,March 23 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌కూ సోకింది!. టాలీవుడ్‌కు చెందిన ఓ సహాయ నటుడికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తోంది. 2 వారాల కిందట బ్యాంకాక్ నుంచి ఆయన హైదరాబాద్‌కు వచ్చాడని.. ఇక్కడ్నుంచి తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లాడు. అయితే బ్యాంకాక్ నుంచి వచ్చినప్పట్నుంచి అతడికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఆయన్ను ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకు తరలించి అత్యవసరం వైద్యం అందిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఈయన ఆస్పత్రికి వెళ్లకుండా మందులు తీసుకుని గడిపేయడం గమనార్హం. ప్రస్తుతం గుంటూరులో ఆయన్ను ఐసోలేషన్ వార్డులో ఉంచి.. టెస్ట్‌లు చేశారు. అయితే.. ఆ సహాయ నటుడి కుటుంబ సభ్యుల్ని మాత్రం క్వారంటైన్‌లో ఉంచారని తెలుస్తోంది. మరోవైపు ఆయన బ్యాంకాక్‌లో షూటింగ్‌ కోసం వెళ్లుంటే ఆయనతో ఎవరెవరున్నారు..? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

గోప్యమెందుకు!?

అయితే.. ఆ నటుడు ఎవరు..? అసలు బ్యాంకాక్ ఎందుకెళ్లాడు..? ఆయనకు నిజంగానే కరోనా సోకిందా..? అసలేం జరిగింది..? అనే విషయాలు ఇప్పటి వరకూ అధికారికంగా వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే.. అసలు ఆ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..? ఆయన ఏ సినిమాలో నటిస్తున్నారు..? అనే విషయాలు మాత్రం బయటికి రానివ్వకుండా చాలా గోప్యంగా ఉంచడం వెనుక అసలేం జరుగుతోందనేది తెలియట్లేదు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.