కలకలం.. గోల్కొండ టోలీచౌక్‌లో కరోనా అనుమానిత కేసు

  • IndiaGlitz, [Sunday,March 15 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కు పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ కోవిడ్-19 వైరస్ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చనిపోవడంతో.. ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు జంకుతున్నారు.

టోలీచౌక్‌లో కలకలం!
హైదరాబాద్‌లో మరొకరికి కరోనా పాజిటివ్ అనే రిపోర్టు కూడా వచ్చింది. తాజాగా.. నగరంలోని గొల్కొండ పరిధిలోని టోలీచౌక్ ఆదాం కాలనీలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. తీవ్ర జ్వరం, దగ్గు, తుమ్ములు వస్తుండటంతో సుజాత అనే మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. సుజాత (22) డీ మార్ట్‌లో ఉద్యోగం చేస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆమెకు పరీక్షలు చేసే పనిలో వైద్యులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే అన్నీ బంద్..
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని స్కూల్స్, థియేటర్స్, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, అవుడ్ డోర్.. ఇండోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, జూపార్కులు, పార్కులు, మ్యూజియమ్స్ మూసివేయాలని కేసీఆర్ తేల్చిచెప్పారు. సర్కార్ నిర్ణయాన్ని కాదని నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. 

More News

చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న `ఈ కథలో పాత్రలు కల్పితం`

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో

అభిమానులారా.. నా ఇంటికి రాకండి : బిగ్‌బీ

కరోనా వైరస్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

అలియా భట్‌కు ‘RRR’ యూనిట్ స్పెషల్ బర్త్‌డే విషెస్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ : కేసీఆర్ ప్రకటనాంతరం చిరు కీలక నిర్ణయం

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.