దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘కరోనా’ సర్వే!

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై పోరు చేస్తూ సర్వే జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటి వరకూ మూడు సర్వేలు పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 32 వేల మంది అనుమానితులను గుర్తించామని.. వారందరికీ వైద్య పరీక్షలు దశలవారీగా చేస్తున్నామని మంత్రి తెలిపారు. పీపీఈల లభ్యతపై వస్తున్న అపోహలు అనవసరం అవన్నీ అవాస్తవాలేనని మంత్రి తెలిపారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని మీడియా ముఖంగా మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

రెండు వేలు ఇస్తాం..!

అనంతరం మీడియా మీట్ నిర్వహించిన మంత్రులు సమావేశానికి సంబంధించిన అన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలో ఇప్పటి వరకూ 11,613 శాంపిళ్లలో 11,111 నెగిటివ్ అని తేలిందన్నారు. వీరిలో 502 మందికి మాత్రమే పాజిటివ్ అని వచ్చింది. ఇప్పటి వరకూ 16 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. ‘ కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్ అమలు తీరుపై ఇవాళ సమీక్షించాం. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలను సీఎం సమీక్షించారు. క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్‌కు సంబంధించి ఎన్‌వోసీ కూడా తయారు చేశాం. క్వారంటైన్ నుంచి ఇళ్లకు పంపేటప్పుడు పేదలకు రూ. 2 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

సుధీర్ఘంగా సమావేశం..

ఇవాళ కరోనా నివారణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, తదనంతరం పరిణామాలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సుధీర్ఘంగా చర్చించారు.

More News

షాకింగ్ : ఏపీలో కరెన్సీ ద్వారా ఇద్దరికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే

‘కమ్మవారు తలచుకుంటే జగన్ లేచిపోతాడు..!’

కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల నోళ్లకు మూత పడట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..?

ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే..

మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న 25వ సినిమా `వి` ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో విడుద‌ల కాలేదు.