గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది: శాస్త్రవేత్తల బృందం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా పయనిస్తోందనే భయానక నిజాన్ని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, మార్కెట్లు, కాసినోల ద్వారా ఒకరి నుంచి ఒకరికి విస్తృతంగా వ్యాపించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందనే వాదన క్రమక్రమంగా బలపడుతోంది. ఈ వాదనను బలపరుస్తూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్వోకు లేఖ రాసింది. గాలిలో ఉండే చిన్న కణాల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తాయనడానికి ఆధారాలున్నాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కరోనా బాధితులు తుమ్మినా లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశించి ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.
కాగా.. ఇప్పటి వరకూ గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని డబ్ల్యూహెచ్వో చెబుతూ వచ్చింది. వైద్య ప్రకియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్ వ్యాపించే అవకాశముందని తెలిపింది. ఇది చాలా అరుదని.. కాబట్టి గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఒకవేళ గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందితే. ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, రద్దీగా ఉండి వెంటిలేషన్ లేని ప్రాంతాలు, కార్యాలయాలు.. ఇలా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కరోనా కట్టడి చాలా కష్టమవుతుంది. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి రావొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com