కరోనా పాటల ఆల్బమ్ ను ఆవిష్కరించిన వి .వి .వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా రక్కసి కరాళ నృత్యాన్ని చూసి ప్రపంచ పటమే భయంతో వణికి పోతున్న నేపధ్యంలో ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో రూపొందిన " కరోనా రక్కసి " అనే పాటల ఆల్బమ్ ను ప్రముఖ సినీ దర్శకులు వి .వి .వినాయక్ ఈనెల 16 వ తేదీన ఆవిష్కరించారు. అభ్యుదయ సినీ దర్శకుడు " బాబ్జీ " రచించిన యీ పాటలను ప్రజా నాట్యమండలి గాయకుడు "లక్ష్మణ్ పూడి " ఆలపించారు. యువ సంగీత దర్శకుడు " ప్రేమ్ " స్వరాలను అందించారు.
ఈ సంధర్భంగా వి .వి .వినాయక్ మాట్లాడుతూ " కరోనా రక్కసి విభృంజన ను చూసి జనమంతా విపరీతంగా భయపడి పోతున్నారని, కానీ మనం చేయవలసినది భయపడడం కాదు, జాగ్రత్తలు తీసుకోవడం అని , యీ విపత్తు సమయంలో ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తులందరూ ఆర్ధికంగా బలహీనంగా వున్న పేద సాదలకు అండగా నిలబడి మానవత్వాన్ని చాటాలని పేర్కొంటూ, ప్రజలను చైతన్య పరిచేందుకై యీ పాటల ఆల్బమ్ ను రూపొందిన బాబ్జీ లక్ష్మణ్ పూడి గార్లను అభినందించారు....!
దర్శక రచయిత బాబ్జీ మాట్లాడుతూ " సమాజం లో ఏ విపత్తు వచ్చినా స్పందించడం, ప్రజల పక్షాన నిలబడడం కళాకారుల బాధ్యత అని, ఆ బాధ్యత తోనే యీ పాటలను రూపొందించామని " అన్నారు.
ప్రజా నాట్యమండలి గాయకుడు , ఈ పాటల ఆల్బమ్ రూపకర్త లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ "లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత ప్రజలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని, ఎవరికి వాళ్ళు మాకు ఏమి కాదు అనే భావన తో బయట తిరుగుతున్నారని, అలాంటి జనాన్ని చైతన్యపరచడానికే యీ పాటలను రూపొందించామని " తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments