భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

  • IndiaGlitz, [Monday,March 02 2020]

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్‌ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌కు ఎలా వచ్చింది!?
హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న దుబాయ్‌కి వెళ్లగా.. అక్కడ నాలుగైదు రోజుల పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న బెంగళూరుకు వచ్చాడు. అనంతరం బస్సులో ప్రయాణించి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి ఔట్ పేషెంట్‌గా వెళ్లాడు. టెస్టుల తర్వాత అనుమానం రావడంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తే కోవిడ్-19 సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిశితంగా మీడియాకు వెల్లడించారు.

కరోనావైరస్ సోకిన ఆ వ్యక్తి ఎవరంటే..?
‘అతడ్ని గాంధీ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరంలేదు. మన వాతావరణ పరిస్థితుల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు. తుమ్ములు, దగ్గు, జ్వరం ఉంటే ఆస్పత్రికి వెళ్లి చూపించుకొండి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌లు ధరించాలి’ అని ఈటెల రాజేందర్ తెలిపారు.

కరోనాపై కేంద్రం స్పందన..!
ఇవాళ భారత్‌లో రెండు కరోనా కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మీడియాకు వెల్లడించారు. ‘ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. 21 ప్రధాన విమానాశ్రయాల్లో, 12 ముఖ్య ఓడరేవుల్లో, 65 చిన్నతరహా ఓడరేవుల్లో ప్రయాణికులకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ 5,57,431 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాం. 12,431 మందికి ఓడరేవుల్లో వైద్య పరీక్షలు చేశాం. దేశాలకు పర్యటించడంపై ఆంక్షలు కొనసాగిస్తున్నాం. చైనా, ఇరాన్, సింగపూర్, కొరియా, ఇటలీ దేశాలకు వెళ్లవద్దు’ అని ఈ సందర్భంగా భారతీయులకు కేంద్ర మంత్రి సూచించారు.

More News

కాల్ రాగానే హీరోయిన్ ముంబై ఎందుకెళ్లింది.. అసలు కథ ఇదీ!?

‘రాహు’ మూవీ హీరోయిన్ కృతి గార్గ్‌‌కు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ట్రాప్ చేశాడని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

కరోనాపై అతి వీడియో ఏంటి చార్మీ.. సబబేనా!?

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

నిర్భయ నిందితుల ఉరి మళ్లీ వాయిదా

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలోని నిందితుల ఉరిశిక్ష ఇప్పట్లో అమలు అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.

‘ఓ పిట్టకథ’ పెద్ద హిట్ కావాలి - మెగాస్టార్ చిరంజీవి

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై

ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్‌' ఫస్ట్ లుక్

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి వ‌కీల్ సాబ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,