తెలంగాణలో 872కు చేరుకున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 872కు చేరుకుంది. సోమవారం రాత్రి అధికారికంగా తెలంగాణ ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 12, మేడ్చల్‌, నిజామాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ మరో ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకూ ఈ మహమ్మారితో పోరాడి 186 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా... 23 మంది మృతి చెందారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 663 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి.

మొత్తానికి చూస్తే గత రెండ్రోజులుగా నమోదైన కేసులతో పోల్చితే ఇవాళ కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాగా.. మే-01 కల్లా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఇదివరకే సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. కేసులు రోజురోజుకూ తగ్గుతూ పోతే మంచి పరిణామమే. మరి రేపటి పరిస్థితేంటో వేచి చూడాలి.

More News

ఇకపై చిరు సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే!?

రాజకీయాలకు రాం రాం చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడానికి సీనియర్, కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు.

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని..

షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు.

ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.

'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.