తెలంగాణలో 872కు చేరుకున్న కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 872కు చేరుకుంది. సోమవారం రాత్రి అధికారికంగా తెలంగాణ ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 12, మేడ్చల్, నిజామాబాద్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని బులెటిన్లో పేర్కొంది. ఇవాళ మరో ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకూ ఈ మహమ్మారితో పోరాడి 186 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా... 23 మంది మృతి చెందారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 663 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి.
మొత్తానికి చూస్తే గత రెండ్రోజులుగా నమోదైన కేసులతో పోల్చితే ఇవాళ కాస్త మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాగా.. మే-01 కల్లా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఇదివరకే సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. కేసులు రోజురోజుకూ తగ్గుతూ పోతే మంచి పరిణామమే. మరి రేపటి పరిస్థితేంటో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout