బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త విన్న కొన్ని గంటల వ్యవధిలేనే మరో ఊహించని విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్కాక్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వరుస షాకింగ్ విషయాలతో బ్రిటన్ ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా మ్యాట్ వెల్లడించారు. వైద్య నిపుణుల సూచన మేరకు తాను కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా లక్షణాలున్నాయని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి.. ఇంట్లో నుంచి పని చేస్తున్నానని తెలిపారు. ఎన్హెచ్ఎస్ సలహా పాటించడం ముఖ్యమని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకూ బ్రిటన్లో 11,658 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. మరోవైపు కరోనా వల్ల 578 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాధినేత కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రధాని, ఆరోగ్య మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout