ఢిల్లీకెళ్లిన తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత సదస్సులో పాల్గొన్న ముస్లింలకు కరోనా భయం మొదలైంది. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్’గా తేలిన వారిలో చాలామంది ఆ సదస్సుకు హాజరైన వారు కావడం గమనార్హం. ఇప్పటికే ఆ సదస్సుకు వెళ్లిన వారిని గుర్తించిన ప్రభుత్వాలు.. వారి కుటుంబ సభ్యులకు, వాళ్లతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు సైతం కరోనా టెస్ట్‌లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో.. తెలంగాణ సచివాలయలో పనిచేసే (పశుసంవర్ధక శాఖ) ఓ సెక్షన్ ఆఫీసర్ కరోనా పాజిటివ్ రావడం కలకలం మొదలైంది. ఇటీవలే ఢిల్లీ ప్రార్థనలకు ఆయన వెళ్లొచ్చారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, కుటుంబీకులు వెంటనే ఆ ఉద్యోగిని గాంధీ ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు చేయగా ఇవాళ సాయంత్రం పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఆయన తోటి ఉద్యోగులు, సన్నిహితుల్లో దఢ మొదలైంది. ఈ క్రమంలో ఆయన ఇంటి చుట్టూ.. బిఆర్కే భవన్ చుట్టూ (సెక్రటేరియట్) జీహెచ్ఎంసీ సిబ్బందితో శానిటేషన్ చేయించారు. మరోవైపు ఆయన కుటుంబీకులు, సన్నిహితులకు కూడా టెస్ట్‌లు చేయించాలని వైద్యాధికారులు, పోలీసులు సిద్ధం అవుతున్నారు.
తోటి ఉద్యోగుల్లో కలవరం..!
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సెక్రటేరియట్‌లో రొటేషన్ వైజ్డ్‌గా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా పాజిటివ్ సోకిన ఆ ఉద్యోగి ఈ మధ్య విధులకు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనతో కలిసి పనిచేసిన తోటి ఉద్యోగుల్లో కలవరం మొదలైందట. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout