ప్రముఖ లేడీ సింగర్‌కు కరోనా పాజిటివ్.. అసలేం జరిగింది!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. చైనా నుంచి ఇప్పటికే 280కు పైగా దేశాలకు పాకిన కరోనా వైరస్.. లెక్కలేనంత మందిని బలితీసుకుంటోంది.!. ఓ వైపు మరణాలు ఎక్కువవుతుండవటంతో.. దీనికి మందు కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు అహర్నిశలూ చెమటోడ్చి కష్టిస్తున్నారు. తాజాగా ప్రముఖ లేడీ సింగర్‌ను కాటేసింది.!
ఎలా సోకింది..!?
అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా.. ఈ విషయాన్ని స్వయంగా ఆ భామే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు.. అసలు ఆమెకు ఎలా సోకింది..? ఇది సోకినప్పుడు ఆమె ఎక్కడ ఉంది..? అనే విషయాలను కూడా నిశితంగా వివరించింది. సరిగ్గా 10 రోజుల క్రితం లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అక్కడ ఈ భామకు కరోనా సోకింది. అయితే కరోనా లక్షణాలు ఉండటంతో పెద్దగా సీరియస్‌గా తీసుకోకుండా ఆ పార్టీ నుంచి నేరుగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. అంతేకాదు.. ఓ పార్టీలో కూడా పాల్గొంది. దీంతో ఆ పార్టీలో పాల్గొన్న వారు..? హోటల్లో బసచేసిన వారు..? లండన్‌లో కార్యక్రమంలో పాల్గొన్నవారు బెంబేలెత్తిపోతున్నారని తెలుస్తోంది.
కనికా మాటల్లోనే..!
‘నాకు కరోనా సోకింది. ఎయిర్ పోర్టులో అందరి మాదిరే నాకు కూడా పరీక్షలను నిర్వహించారు. అయితే ఆ పరీక్షల సమయంలో ఏమీ లేదని తేలింది. వారం రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. 4 రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనపడటంతో నాకు నేనుగా పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం నేను.. నా కుటుంబసభ్యులు క్వారంటైన్లో ఉన్నాం. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారందరూ నిర్బంధంలో ఉన్నారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం విధించుకోవాలి. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి’ అని కనికా కపూర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను షేర్ చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com