టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభించిన తరువాతే ఈ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. పోలీసులు, అర్చకులు, పోటు కార్మికులకు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిందన్నారు. 70 మంది ఉద్యోగులు ఇప్పటికే కోలుకున్నారన్నారు.
బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం
కాగా.. శ్రీవారి ఆలయంలో ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనాల కన్నా పూజా కైంకర్యాలు నిర్వహించడానికే ప్రాధాన్యత కాబట్టి అర్చకులతో చర్చించామన్నారు. తమకు వసతితో పాటు భోజన సౌకర్యం కల్పించాలని అర్చకులు కోరారని... అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి ఆలయంలో దర్శనాలు సంఖ్య పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
మాకు బదిలీ సౌకర్యం కల్పించండి: టీటీడీ అర్చకులు
కరోనా వైరస్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదని తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు చెబుతున్నారు. అయితే భక్తుల వలన తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. క్యూలైన్‌కు సమీపంలో అర్చకులెవరూ విధులు నిర్వహించడం లేదన్నారు. నేడు అర్చక బృందమంతా టీటీడీ చైర్మన్‌ను కలిసింది. తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బదిలీ సౌకర్యం కల్పించాలని కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout