తెలంగాణలో తాజాగా 1554 మందికి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Thursday,July 23 2020]

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం తెలంగాణ కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తాజాగా తెలంగాణలో 15,882 శాంపిళ్లను పరీక్షించగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కు చేరింది. తాజాగా తొమ్మిది మంది కరోనా మృతి చెందగా.. ఇప్పటి వరకూ 438 మంది మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే కరోనా నుంచి 1,281 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 37,666 మంది డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,08959 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల జనాభాకు 7,327 టెస్టులు చేశామని, ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్‌ రేటు 16 శాతంగా ఉందని పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీలో 842, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 96, కరీంనగర్‌లో 73, నల్లగొండలో 51, వరంగల్‌ అర్బన్‌లో 38, వరంగల్‌ రూరల్‌లో 36, ఖమ్మంలో 22 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

నిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు:  ఆర్జీవీ

త‌న సినిమాను రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌బ్లిసిటీ చేసుకున్నంత‌గా మ‌రే ద‌ర్శ‌కుడు చేసుకోలేడు. ఇది వాస్త‌వం.

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం.. విచిత్రమేంటంటే...

ఏపీ మంత్రులుగా నేడు వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాత కాబోతున్న స్టార్ హీరో!!

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌లు ఇప్ప‌టికే తాత‌య్య‌ల లిస్టులో చేరిపోయారు.

రామ్‌చ‌ర‌ణ్ తదుపరి ఖరారైనట్లేనా..?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.