తెలంగాణలో తాజాగా 1554 మందికి కరోనా పాజిటివ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం తెలంగాణ కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తాజాగా తెలంగాణలో 15,882 శాంపిళ్లను పరీక్షించగా.. 1,554 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కు చేరింది. తాజాగా తొమ్మిది మంది కరోనా మృతి చెందగా.. ఇప్పటి వరకూ 438 మంది మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే కరోనా నుంచి 1,281 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 37,666 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,08959 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల జనాభాకు 7,327 టెస్టులు చేశామని, ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ రేటు 16 శాతంగా ఉందని పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్ఎంసీలో 842, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 96, కరీంనగర్లో 73, నల్లగొండలో 51, వరంగల్ అర్బన్‌లో 38, వరంగల్ రూరల్‌లో 36, ఖమ్మంలో 22 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout