ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు 

  • IndiaGlitz, [Friday,July 10 2020]

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. శుక్రవారానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 21 వేల 20 మందికి పరీక్షలు నిర్వహించగా 1608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఏపీకి చెందిన 1576 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25,422కి చేరుకుంది. నేడు కరోనా కారణంగా 15 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 292కి చేరింది. కాగా.. ప్రస్తుతం ఏపీలో 11,936 యాక్టివ్ కేసులుండగా.. 13,194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

More News

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కొట శ్రీనివాస‌రావు

విల‌క్ష‌ణ న‌టుడు కొటాశ్రీనివాస‌రావు వేయ‌ని పాత్ర‌లు లేవ‌నే చెప్పాలి.. భార‌త‌దేశం లో  సుమారు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించిన గొప్ప లెజండ‌రి యాక్ట‌ర్ ఆయ‌న‌.

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`.

2 రోజులుగా అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి.. చివరకు..

నిండు గర్భిణి.. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల పాటు అంబులెన్స్‌లోనే జంట నగరాల్లోని పలు హాస్పిటల్స్ తిరిగింది.

పొలిటికల్ జిమ్మిక్‌లొద్దు: కేసీఆర్ మిస్సింగ్ పిటిషన్‌పై హైకోర్టు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు.. అసలేం జరిగింది!

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.