తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 453. బుధవారం సాయంత్రం ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడించారు.
‘తెలంగాణ ఇవాళ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 453. ఇప్పటి వరకు 45 మంది వైరస్ నుంచి కోలుకోగా 11 మంది చనిపోయారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 397యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీరిలో ఎవరూ వెంటిలేటర్ల మీద లేరు. సాధారణ ట్రీట్‌మెంటే జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితులంతా క్షేమంగా ఉన్నారు. వారందర్నీ రేపు డిశ్చార్జి చేస్తాం. మర్కజ్‌కు వెళ్లొచ్చిన 1100 మందికి పరీక్షలు చేశాం. వారికి దగ్గరగా మెలిగిన 3158 మంది క్వారంటైన్ చేశాయి. రాబోయే రోజుల్లో అనుమానితుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో మందుల కొరత లేదు. డాక్టర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మొత్తం 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సైతం కోవిడ్ ఆస్పత్రులుగా పనిచేస్తాయి’ అని ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments