సూర్యాపేట జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే అనుకుంటే ఇప్పుడు జిల్లాలకూ పెద్ద ఎత్తున వ్యాపించింది. మరీ ముఖ్యంగా బార్డర్‌లో జిల్లాల్లో కరోనా రక్కసి కాటేస్తోంది. సూర్యాపేట జిల్లాలో భారీగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 54 కేసులు.. ఇవాళ మాత్రం 26 కేసులే నమోదయ్యాయి. ఇవన్నీ కమ్యూనిటీ వ్యాప్తి అనగా.. కరోనా సోకిన వ్యక్తి తాకిడి ద్వారా వచ్చిన కేసులు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 80కి చేరుకుందని జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ 796 శాంపిల్స్ సేకరించామని.. గవర్నర్ క్వారంటైన్ పరిధిలో 210 ఉన్నారని హెల్త్ ఆఫీసర్ తెలిపారు. మరోవైపు హోం క్వారంటైన్‌లో మాత్రం 4346 మంది ఉన్నారు.
ఇప్పటి వరకూ కరోనా కేసుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. సూర్యాపేట రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో జిల్లాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్షించి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పర్యటించనున్నారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 757 కాగా.. ఏపీలో కేసుల సంఖ్య 872కు చేరుకుంది. ఇక ఇండియాలో 18,985 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout