భారత్‌లో కరోనా ఉగ్రరూపం.. భయం..భయం!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయే తప్ప కంట్రోల్ అవ్వట్లేదు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ సోకడం మొదలుకుని ఇప్పటి వరకూ మెడిసిన్ రాకపోవడం కలవరపాటుకు గురిచేసే విషయం. ఇప్పటి వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా ఈ సడలింపులు వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయనే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు.
ఇదే ఫస్ట్ టైమ్..
దేశ వ్యాప్తంగా రోజుకు 10వేలకు పైచిలుకే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు అయితే వందల సంఖ్యలోనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రోజుకు 250కి పైగా మరణాలు సంభవిస్తుండగా.. గత 24గంటలుగా ఒక్కరోజే 357 మంది కరోనాతో చనిపోవడం తీవ్ర భయాందోళనకు కలిగించే విషయం. కాగా.. ఇంతవరకూ ఇన్ని మరణాలు నమోదు కాలేదు. ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారని తెలియవచ్చింది. ఇవన్నీ అటుంచితే ప్రపంచంలో రోజువారి కేసుల్లో అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతున్న విషయం ప్రజలు భయంతో బిక్కిబిక్కిమంటున్నారు.
స్థానాలు మారిపోతున్నాయ్..
గడిచిన 24 గంటల్లో 9996 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,86,579కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడ్డవారిలో 1,41,029 మంది కరోనాను జయించగా.. ప్రస్తుతం 1,37,448 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా మరణాల ప్రకారం చూస్తే భారత్.. కెనాడాను దాటేసింది. అంతేకాదు 12వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మరణాల ప్రకారం 11వ స్థానానికి చేరుకుంది. పాజిటివ్ కేసుల విషయంలో ఐదో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో యూకేకి చేరువైందని వరల్డ్ మీటర్ ప్రకారం తెలుస్తోంది.
ఇదో సంచలన విషయం..
ఇదిలా ఉంటే.. ఉదయం ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అనంతరం మరో సంచలన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే.. సెంట్రల్ రిజర్వ్ పోలీసుఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) లో 544 మందికి కొవిడ్ -19 సోకడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వీరందర్నీ ఓఖ్లా నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు సీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌తోపాటు 20మంది సీనియర్ అధికారులను ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌కు తరలించారు. మొత్తానికి చూస్తే భారత్‌లో పరిస్థితులు చూస్తే సాధారణంగా లేవనే చెప్పుకోవాలి. అంతేకాదు ఈసారి ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ 6.0 విధిస్తేగానీ పరిస్థితులు అనుకూలించవేమో.!. జూన్-30 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments