ఏపీ కరోనా బులిటెన్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఏపీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. మూడు రోజులుగా మరింత అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. నిన్న ఏపీలో 425 పాజిటివ్ కేసులు నమోదవగా.. నేడు ఏకంగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. కాగా.. ఈ కేసుల్లో ఏపీకి చెందిన 376 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మొత్తంగా నేటికి ఏపీలో 7961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. మొత్తంగా కరోనా కారణంగా ఏపీలో నేటికి 96 మంది మృతి చెందారు. కాగా.. కరోనా పరీక్షలు ఎక్కువ మొత్తంలో నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి కావడం కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా తెలుస్తోంది.
#COVIDUpdates: As on 19th June, 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 19, 2020
COVID Positives: 6230
Discharged: 3065
Deceased: 96
Active Cases: 3069#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zMMwNYYpJH
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com