ఏపీలో గంటగంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ ఇరు రాష్ట్రాల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనంతటికి కారణం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన కొన్ని కార్యకలాపాలే.!. ఈ నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం నుంచి ఇప్పటి వరకూ వరుసగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇదివరకూ తెలంగాణ కంటే చాలా తక్కువ కేసులు ఉన్న ఏపీలో ఇప్పుడు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. దీనంతంటికీ కారణం.. కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 80 శాతం ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం.
గురువారం నాడు ఉదయం 9 గంటల తర్వాత కేవలం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 135కు చేరింది. అయితే గంటల వ్యవధిలోనే ఆ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. ఏపీ ఆరోగ్య శాఖ సాయంత్రం 6గంటలకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ క్రిష్ణ జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యా. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పెరుగుతన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న నాలుగు టెస్టింగ్ సెంటర్లతో పాటు మరో రెండు టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com