తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి. కానీ సోమవారం 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 11,528 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1550 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరుకుంది. కాగా నిన్న కరోనాతో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 365కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,178 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1197 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 23,679 మంది డిశ్చార్జ్ అయ్యారు.