ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
- IndiaGlitz, [Thursday,July 09 2020]
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నేడు కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్ పరీక్షించగా 1555 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రానికి చెందిన 1500 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 మందికి.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23814కు చేరింది.
గడచిన 24 గంటల్లో 13మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 277కి చేరుకుంది. కాగా నేడు 904 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 11383 యాక్టివ్ కేసులుండగా. 12154 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ 10 లక్షల 94 వేల 615 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 09/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 9, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,071 పాజిటివ్ కేసు లకు గాను
*10,250 మంది డిశ్చార్జ్ కాగా
*277 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,544#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eqJU6sVkoJ