ఏపీలో 757కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇవాళ ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనాతో మొత్తం 22 మంది మృతి చెందారు. 639 మందికి కొనసాగుతున్న చికిత్స కొనసాగుతుండగా.. 96మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో కర్నూలు-10, గుంటూరు-9, కడప-6, ప.గో- 04, కృష్ణా-3, అనంతపురం-03 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా లెక్కలు చూస్తే..
అనంతపురం : 36
చిత్తూరు : 53
తూర్పుగోదావరి : 26
గుంటూరు : 158
కడప జిల్లా : 46
కృష్ణా జిల్లా : 83
కర్నూలు జిల్లా : 184
నెల్లూరు : 67
ప్రకాశం : 44
విశాఖపట్న: 21
పశ్చిమ గోదావరి : 39
జగన్ సమీక్ష..
కోవిడ్–19 నివారణా చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు చేశారు.
ఈ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు, మరిన్ని చర్యలకు సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో టెస్టులు బాగా జరుగుతున్నాయని అధికారులు జగన్‌కు వివరించారు. సమగ్ర సర్వేలద్వారా గుర్తించిన 32వేలమందిలో ఇప్పటికే 2వేలకుపైగా పరీక్షలు చేశామని.. త్వరలోనే మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు. క్వారంటైన్ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments