తెలంగాణలో నిన్న భారీగా కేసులు.. ఉపశమనం కలిగించే అంశమిదే

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

తెలంగాణలో రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న కేసులు దాదాపు రెండు వేలకు చేరవవడం గమనార్హం. బుధవారం ఒక్కరోజే కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 29వేల 836కు చేరుకుంది. కరోనా కారణంగా బుధవారం 11 మంది మరణించగా.. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం మరణాల సంఖ్య 324కు చేరుకుంది. ప్రస్తుతం 11వేల 933 యాక్టివ్ కేసులుండగా.. 17వేల 279మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా నిన్న నమోదైన కేసుల్లో 1590 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.

అయితే కేసుల సంఖ్య తీవ్రంగా భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ టెస్టుల విషయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం దీనిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ టెస్టులు చేసినప్పటికీ ఫలితం రావడం ఆలస్యమవుతోంది. ఈ క్రమంలోనే ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచడం కోసం 2 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.

More News

ర‌వితేజ కోసం రాశీఖ‌న్నా స్పెష‌ల్..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

నిర్మాత‌గా మారుతున్న చిరు కుమార్తె

మెగాస్టార్ చిరంజీవి కుంటుంబంలో ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వెంటిలేటర్‌పై సీనియర్ నటి జయంతి..

సీనియర్ నటి జయంతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు. కొంతకాలంగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు.

బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి

మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.