తెలంగాణలో నిన్న భారీగా కేసులు.. ఉపశమనం కలిగించే అంశమిదే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న కేసులు దాదాపు రెండు వేలకు చేరవవడం గమనార్హం. బుధవారం ఒక్కరోజే కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 29వేల 836కు చేరుకుంది. కరోనా కారణంగా బుధవారం 11 మంది మరణించగా.. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం మరణాల సంఖ్య 324కు చేరుకుంది. ప్రస్తుతం 11వేల 933 యాక్టివ్ కేసులుండగా.. 17వేల 279మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా నిన్న నమోదైన కేసుల్లో 1590 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.
అయితే కేసుల సంఖ్య తీవ్రంగా భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ టెస్టుల విషయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం దీనిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ టెస్టులు చేసినప్పటికీ ఫలితం రావడం ఆలస్యమవుతోంది. ఈ క్రమంలోనే ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచడం కోసం 2 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout