భారీగా పెరిగిన కరోనా కేసులు.. భాగ్యనగరంలో భయం భయం

తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. గత రెండువారాలుగా సింగిల్ డిజిట్‌లో మాత్రమే నమోదైన కేసులు నాలుగైదు రోజులుగా మునుపటి కంటే రెట్టింపు కేసులు నమోదవుతుండటం గమనార్హం. నిన్న మొన్నటి వరకూ 30,31 నమోదైన కేసులు సోమవారం రోజుకు మాత్రం భారీగా పెరిగిపోయాయ్. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో మరో 79కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. అయితే.. ఇవాళ నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. చాలా రోజులుగా నగరంలో చాలా తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.

భయం.. భయం..!

అయితే ఇలా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడం భాగ్యనగరవాసుల్లో భయం భయం నెలకొంది. ఇవాళ నమోదైన 79 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. ఇవాళ 50 మంది కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మొత్తం ఇప్పటి వరకూ 801 మంది డిశ్చార్జి అయ్యారు. అయితే ఇప్పటి వరకూ 30 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 44 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

లాక్ డౌన్ పొడిగింపే!?

రోజురోజుకు ఇలా కరోనా కేసులు పెరుగుతుండటాన్ని బట్టి చూస్తే కచ్చితంగా మరోసారి లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా ఎక్కడపడితే వాహనాల్లో తిరిగేయడం.. మరీ ముఖ్యంగా ఎక్కడ చూసినా జనాలే.. ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా.. ఏ సిగ్నల్ దగ్గర చూసినా జనాలే జనాలున్నారు. మద్యం షాపులు తెరవడం కూడా ఇందుకు ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాగైతే హైదరాబాద్ వ్యాప్తంగా సడలింపులు కచ్చితంగా ఎత్తేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకు లాగా కాకుండా మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

More News

మెగా డెబ్యూ హీరో సాంగ్ సెన్సేష‌న్‌

ఇప్ప‌టికే ప‌దిమందికి పైగా హీరోలున్న మెగాఫ్యామిలీ నుండి మ‌రో హీరో ప‌రిచ‌యం అవుతున్నారు. అతనెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నే వైష్ణ‌వ్ తేజ్‌.

బాయ్‌ఫ్రెండ్ పేరు బ‌య‌ట పెట్టిన బ్యూటీ

సాధార‌ణంగా హీరోయిన్స్ సినిమాల్లో బిజీగా ఉన్న‌ప్పుడు ప్రేమ‌, పెళ్లి గురించి వార్త‌లపై పెద్ద‌గా మాట్లాడ‌రు. త‌మ ఫోక‌స్ అంతా కెరీర్‌పైనే పెడ‌తారు. అలా ఉంటేనే కానీ అవ‌కాశాలు రావ‌ని వారి

స్వ‌దేశీ చిత్రంగా బ‌న్నీ 'పుష్ప‌'

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పుష్ప‌’. తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కరోనా కష్టాలు మహానటికే తప్పడం లేదు!!

కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. ఎంత‌లా అంటే అస‌లు క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేట‌ర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి.

‘గ‌బ్బ‌ర్ సింగ్’ ... ప‌వ‌న్ స్టామినాకు ఓ మార్క్‌

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌... స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌కి సంబంధం లేకుండా హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఏకైక టాలీవుడ్‌స్టార్‌. ఇలా చెప్ప‌డానికి కార‌ణం. సాధార‌ణంగా