ఏపీలో కరోనా విజృంభణ.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందో తప్ప తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా 80 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గురువారం నాడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 80 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 893కి చేరుకుంది. కరోనాపై పోరాడి కోలుకున్న వారి సంఖ్య 141 కాగా.. 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 725 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి 09:00 గంటల నుంచి ఇవాళ 09:00 గంటల వరకూ (24 గంటల్లో) 6522 శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు చేయగా 80 మంది పాజిటివ్ అని తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.

ఎందుకంటే..

ఇక జిల్లాల విషయానికొస్తే.. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప కంట్రోల్ అవ్వట్లేదు. అయితే.. ఇప్పటి వరకూ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికే పాజిటివ్ రాగా.. ఇప్పుడు వారితో కాంటాక్ట్ అయిన వారికి పాజిటివ్ ఎక్కువగా తేలుతున్నట్లు సమాచారం. అందుకే ఇంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఒక్కరోజే కర్నూలు జిల్లాలో - 31, గుంటూరు-18, చిత్తూరు-14 కొత్త కేసులు నమోదవ్వడం గమనార్హం. నెల్లూరులో మాత్రం ఇవాళ ఎలాంటి కేసూ నమోదవ్వలేదు. బుధవారం నాడు కేవలం 56 కేసులే నమోదవ్వగా.. 24 గంటల్లో 80 కేసులు నమోదవ్వడం గమనార్హం.

More News

ఈ వీడియో ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలనుంది : ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు.

'సాయిరెడ్డీ.. గొంతుకు కాదు.. ముక్కుకు మాస్క్ పెట్టుకోండి!'

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు

అర్నబ్‌ గోస్వామిపై దాడి వెనుక అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని టీవీ చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు

తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్

స‌మంత ఈజ్ బ్యాక్‌

స‌మంత అక్కినేనికి ఏమైంది? అని చాలా రోజులుగా ఆమె అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. సాధార‌ణంగానే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత.. ఇప్ప‌డు కామ్ అయిపోయారు.