ఏపీలో కరోనా విజృంభణ.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు
- IndiaGlitz, [Thursday,April 23 2020]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందో తప్ప తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా 80 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గురువారం నాడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 80 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 893కి చేరుకుంది. కరోనాపై పోరాడి కోలుకున్న వారి సంఖ్య 141 కాగా.. 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 725 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి 09:00 గంటల నుంచి ఇవాళ 09:00 గంటల వరకూ (24 గంటల్లో) 6522 శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు చేయగా 80 మంది పాజిటివ్ అని తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.
ఎందుకంటే..
ఇక జిల్లాల విషయానికొస్తే.. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప కంట్రోల్ అవ్వట్లేదు. అయితే.. ఇప్పటి వరకూ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికే పాజిటివ్ రాగా.. ఇప్పుడు వారితో కాంటాక్ట్ అయిన వారికి పాజిటివ్ ఎక్కువగా తేలుతున్నట్లు సమాచారం. అందుకే ఇంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఒక్కరోజే కర్నూలు జిల్లాలో - 31, గుంటూరు-18, చిత్తూరు-14 కొత్త కేసులు నమోదవ్వడం గమనార్హం. నెల్లూరులో మాత్రం ఇవాళ ఎలాంటి కేసూ నమోదవ్వలేదు. బుధవారం నాడు కేవలం 56 కేసులే నమోదవ్వగా.. 24 గంటల్లో 80 కేసులు నమోదవ్వడం గమనార్హం.
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
— ArogyaAndhra (@ArogyaAndhra) April 23, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 893 పాజిటివ్ కేసు లకు గాను 141 మంది డిశ్చార్జ్ కాగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QxvmihvyBP