దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్క మహారాష్ట్రలోనే..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య శుక్రవారానికి 5 లక్షలు దాటింది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం కరోనా మరింత ఉధృత రూపం దాల్చింది. 26 రోజులకు ముందు 2 లక్షలున్న కరోనా కేసులు ఈ కొద్ది రోజుల్లో 3 లక్షలకు పైగా పెరిగిపోయాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 17వేల 296కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5, 08, 953 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 1,97, 387 మందికి చికిత్స కొనసాగుతుండగా... ఇప్పటి వరకూ 2, 95, 880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 407 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. ఇప్పటి వరకూ 15,301 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర ఇంకా ప్రథమ స్థానంలోనే కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. కాగా వైరస్ కేసుల్లో ఢిల్లీ.. ముంబైని మించడం గమనార్హం. ముంబైలో 70 వేల కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 73 వేలకు పైగా కేసులు రఇప్పటి వరకూ నమోదయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments