తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

  • IndiaGlitz, [Friday,June 26 2020]

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి. 3616 కేసులను పరిశీలించగా.. కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11వేల 364కు చేరుకున్నాయి.

తాజాగా 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 230కి చేరుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 737 కేసులు నమోదవగా.. రంగారెడ్డి-86, మేడ్చల్-60 , కరీంనగర్-23 కేసులు నమోదయ్యాయి. నిన్న 327 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటికి 4688 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6446 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడైంది.