తెలంగాణలో కొత్తగా 2012 కేసులు..
- IndiaGlitz, [Wednesday,August 05 2020]
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం రెండు వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను బుధవారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 21,118 శాంపిళ్లను పరీక్షించగా.. 2012 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కేసుల సంఖ్య 70,958కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 576కి చేరుకుంది. నిన్న కరోనా నుంచి 1139 మంది కోలుకోగా.. మొత్తం ఇప్పటి వరకూ 50,814 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,938 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 71.6శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 05.08.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/Xj0xm10mRS
— Dr G Srinivasa Rao (@drgsrao) August 5, 2020