ఎన్నికల బరిలో కరోనా..
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే.. ఓహో ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రచారం పేరుతో తమ అనుచరలతో హల్ చల్ చేస్తున్నారు కాబట్టి ఇంకేంముంది కరోనా విజృంభిస్తోంది అందుకే అలా టైటిల్ ఇచ్చి ఉంటారని భావిస్తూ ఉండొచ్చు. లేదంటే రకరకాల ఆలోచనలు మనసులో మెదిలి ఉండొచ్చు. కానీ ఇదొక ఆసక్తికరమైన విషయం. ఈ న్యూస్ తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించింది. కాదు. కేరళలో వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది.
కరోనా అంటే వైరస్ కాదు.. ఎన్నికల్లో పోటీ చేయబోయే మహిళ పేరు. ఆమె పూర్తి పేరు కరోనా థామస్. కేరళలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లాం కార్పొరేషన్ పరిధిలోని మథిలిన్ వార్డు నుంచి బీజేపీ తరుఫున ఆమె పోటీ చేస్తున్నారు. కొల్లాంకు చెందిన థామస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తికి ఇద్దరు కవల పిల్లలుగా ఒక పాప, బాబు జన్మించారు. వారికి వినూత్నంగా పేరు పెట్టాలని ఆయన భావించారు. ఈ క్రమంలో బాబకు ‘కోరల్’ అని.. పాపకు ‘కరోనా’ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ కరోనాయే కేరళలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout