కరోనా భయం: ఫ్రెండ్ దగ్గుతున్నాడని కాల్చేశాడు..!

రోనా.. కరోనా.. ఉదయం నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ ఆ మహమ్మారి భయమే. ఎవరు దగ్గుతున్నా.. తుమ్ముతున్నా వారిపై అనుమానమే. మరోవైపు ఎవరైనా అనుమానంగా కనపడితే చాలు ఇక అంతే సంగతులు. మరీ ముఖ్యంగా తమను చూసి ఎవరైనా అదే పనిగా దగ్గుతున్నా.. తుమ్మినా ఇక ఎదుటి వ్యక్తి ఎంత చికాకు పుడుతుందో.. ఒకసారి అర్థం చేస్కోండి. ఇలా చేస్తున్నాడనే తన మిత్రుడినే మరో ఫ్రెండ్ కాల్చేశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది!?

పూర్తి వివరాల్లోకెళితే.. గ్రేటర్ నోయిడాలోని దయానగర్‌కు చెందిన ప్రశాంత్‌సింగ్ అలియాస్ ప్రవేశ్ (25), జై వీర్‌సింగ్ అలియాస్ గుల్లూ (30) ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నిన్న రాత్రి ప్రశాంత్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దయానగర్ ఆలయంలో లూడో ఆడుతున్నాడు. అదే సమయంలో జై వీర్ అక్కడికి వచ్చాడు. అతడ్ని చూసిన ప్రశాంత్.. పదే పదే దగ్గడం మొదలెట్టాడు. దీంతో గుల్లూకు చిరాకేసింది. ఎందుకిలా చేస్తున్నావ్..? ఏమైంది నీకు..? నన్ను చూసే ఎందుకిలా దగ్గుతున్నావ్..? అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో ఆ గొడవ కాస్త ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ తన జేబులోంచి తుపాకీ తీసి ప్రవేశ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రవేశ్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి మిత్రులు హుటాహుటిన ప్రవేశ్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ పరిస్థితి..

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా పరిస్థితి ఎలా ఉందో.. ఒకప్పుడు దగ్గినా.. తుమ్మినా అర్థాలు వేరేగా ఉండేవి.. కానీ ఈ టైమ్‌లో ఆ రెండూ చేసినా అచ్చు తప్పే.. మరీ ముఖ్యంగా పనిగట్టుకుని మరీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో పైన చెప్పిన ఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ.

More News

మాజీ ల‌వ‌ర్ పేరుని చెరిపేసిన న‌య‌న‌తార‌

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజే వేరు. మూడు నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాదు. సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది.

‘ఆచార్య‌’లో చిరు పాత్ర ఎలా ఉంటుందంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌

ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేస్తాం: కేసీఆర్

తెలంగాణలో ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం

ప్ర‌భాస్ జ‌త‌గా చేయ‌డానికి భారీ డిమాండ్ చేసిన బ్యూటీ

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లు ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌పై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మే-03 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం..