ఈ మూడు లక్షణాలు కన్నించినా కరోనా సోకినట్టేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సరికొత్తగా రూపు మార్చుకుని మరీ ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చే నాలుగు వారాలు మరింత క్లిష్టమైనవని చెబుతూ.. ఎప్పటికప్పుడు ప్రజానీకానికి అవగాహనను కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు కరోనా లక్షణాలతో ప్రజలు బాధపడుతుండగా... తాజాగా మరో మూడు లక్షణాలతో ఈ సెకండ్ వేవ్ భారత్‌ను తాకింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదటి దానికంటే తీవ్రంగా ఉన్నదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు కొవిడ్-19 సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి. దీనికి తాజాగా మరో మూడు లక్షణాలు యాడ్ అయ్యాయి. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ వ్యాపించిన వారిలో కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పింక్ ఐస్ లేదా కండ్లకలక అనేది కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు సంకేతమని తేలింది. కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన 12 మందిలో ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.
ఒక రకమైన వినికిడి లోపం కూడా కరోనా లక్షణమేనని వైద్యులు తేల్చారు. దీనిని కరోనా సోకిందనడానికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొవిడ్-19 ఇన్ఫెక్షన్ వినికిడి సమస్యలకు దారితీస్తుంది. అలాగే మరో లక్షణాన్ని కూడా నిపుణులు కనుగొన్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో అనేక జీర్ణశయాంతర ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, ఉదరంలో తిమ్మిరి, వికారం, నొప్పి కరోనావైరస్ సంకేతాలని వైద్యులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments