రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ.. పరీక్ష చేయించుకోవడమే బాధితుడికి పెద్ద పరీక్షలా ఉండేది. ఇక సామాన్యుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. పరీక్ష చేయించుకోవడమే పెద్ద గగనమైతే.. ఆ పరీక్ష తాలుకు ఫలితం వచ్చే సరికి బాధితుడు ఉంటాడో పోతాడో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వాటన్నింటినీ రాష్ట్రాలు అధిగమిస్తున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చేశాయి. వేగంగా పరీక్షలు.. ఫలితం తెలిసిపోతోంది.
తాజాగా పరీక్ష చేయించుకోవడం మరీ ఈజీ అయిపోయింది. పరీక్షా కేంద్రం వరకూ వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే ఉండి కరోనా టెస్ట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కరోనా కిట్ కేవలం రూ.399కే లభ్యమవుతోంది. పరీక్ష ఫలితం కూడా మూడు గంటల్లో వచ్చేస్తుంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కిట్‌ను రూపొందించారు. అయితే దీనికి సారథ్యం వహించింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తి.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ రామగోపాల్‌రావు సారథ్యంలో ఈ కిట్ రూపొందింది. అయితే కిట్ ధర రూ.399 అయినప్పటికీ ల్యాబ్ చార్జీలు కలిపి ఒక్కో టెస్టుకు రూ.650 వరకూ ఖర్చవుతుంది. దీనికి కరోస్యూర్ టెస్ట్ కిట్ అని పేరు పెట్టారు. ఈ కిట్‌కు ఐసీఎంఆర్, డీసీజీఐ ఆమోదం కూడా లభించింది. ఆర్‌టీపీసీఆర్ పద్ధతిలో ఈ కిట్ ద్వారా టెస్టులు చేయవచ్చు. కాగా.. ప్రపంచంలో ఇదే అతి చవకైన కిట్ కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout