రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ.. పరీక్ష చేయించుకోవడమే బాధితుడికి పెద్ద పరీక్షలా ఉండేది. ఇక సామాన్యుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. పరీక్ష చేయించుకోవడమే పెద్ద గగనమైతే.. ఆ పరీక్ష తాలుకు ఫలితం వచ్చే సరికి బాధితుడు ఉంటాడో పోతాడో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వాటన్నింటినీ రాష్ట్రాలు అధిగమిస్తున్నాయి. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చేశాయి. వేగంగా పరీక్షలు.. ఫలితం తెలిసిపోతోంది.

తాజాగా పరీక్ష చేయించుకోవడం మరీ ఈజీ అయిపోయింది. పరీక్షా కేంద్రం వరకూ వెళ్లనక్కర్లేదు. ఇంట్లోనే ఉండి కరోనా టెస్ట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. కరోనా కిట్ కేవలం రూ.399కే లభ్యమవుతోంది. పరీక్ష ఫలితం కూడా మూడు గంటల్లో వచ్చేస్తుంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కిట్‌ను రూపొందించారు. అయితే దీనికి సారథ్యం వహించింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తి.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ రామగోపాల్‌రావు సారథ్యంలో ఈ కిట్ రూపొందింది. అయితే కిట్ ధర రూ.399 అయినప్పటికీ ల్యాబ్ చార్జీలు కలిపి ఒక్కో టెస్టుకు రూ.650 వరకూ ఖర్చవుతుంది. దీనికి కరోస్యూర్ టెస్ట్ కిట్ అని పేరు పెట్టారు. ఈ కిట్‌కు ఐసీఎంఆర్, డీసీజీఐ ఆమోదం కూడా లభించింది. ఆర్‌టీపీసీఆర్ పద్ధతిలో ఈ కిట్ ద్వారా టెస్టులు చేయవచ్చు. కాగా.. ప్రపంచంలో ఇదే అతి చవకైన కిట్ కావడం విశేషం.

More News

టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌కు యాక్సిడెంట్.. కేర్‌కు తరలింపు

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఇటీవల సడలింపులివ్వడంతో ప్రమాదాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

చిరు 153 డైరెక్టర్ మారుతున్నాడా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’చిత్రీకరణను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.