దేశంలో ముమ్మర దశను దాటిన కరోనా.. అంతం అప్పుడే..
- IndiaGlitz, [Monday,October 19 2020]
భారత్‌లో కరోనా అంతం ఎప్పుడు? అసలు ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటి సమాధానాలిచ్చింది. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమిటి పలు విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా ముమ్మర దశను దాటేసిందని కమిటీ వెల్లడించింది.
అయితే ప్రజలు ఏమాత్రం కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా మహమ్మారి ఇండియాలో పూర్తిగా అంతమవుతుందని ప్రత్యేక కమిటి వెల్లడించింది. కాగా.. కేంద్రం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. అంతేకాదు 2021 ఫిబ్రవరి నాటికి సుమారు కోటి ఐదు లక్షల మంది కరోనా బారిన పడతారని కమిటీ అంచనా వేసింది.