కరోనా అలెర్ట్: శ్రీనాథ్ రెడ్డిని రంగంలోకి దింపిన జగన్ సర్కార్ !
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో ఢిల్లీ మసీద్ కనెక్షన్స్‌తో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీలో చాలా తక్కువ పాజిటివ్ కేసులో ఇవాళ్టితో ఒక్కసారిగా 40కు చేరుకున్నాయి. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారిలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో అసలు ఏం జరుగుతోందో ప్రభుత్వానికే దిక్కుతోచట్లేదట. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కె. శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. కాగా ఈయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. వైద్యుడిగా అపార అనుభవం ఉండటం, మంచి హస్తవాసి కావడంతో ఆయనకు జగన్ సర్కార్ ఈ కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాగా ఇవాళ లేదా రేపు ఉదయం శ్రీనాథ్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌తో కీలక సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా.. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరిందని మంగళవారం నాడు ప్రభుత్వం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేవలం 12 గంటల్లోనే 17 కొత్త కేసులు నమోదవ్వడం షాకింగ్ కలిగిస్తోంది. కాగా ఢిల్లీ మసీదులో ప్రార్థనలకు వెల్లిన వారిలో కర్నూలు నుంచి 189, గుంటూరు నుంచి 88, అనంతపూర్ 73, ప్రకాశం 67, నెల్లూరు 68, వైస్సార్ కడప 59, క్రిష్ణా 43, విశాఖపట్నం 42, చిత్తూరు 36, తూర్పుగోదావరి 27, పశ్చిమ గోదావరి 16, విజయనగరం నుంచి 03 ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. కాగా.. వీరిలో చాలా వారిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఇంకా కొందర్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.
ఎక్కడెక్కడ ఎన్ని..!?
ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరుకుంది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 17 మందికి కరోనా పాజిటివ్‌గా రాగా.. 147 మందికి నెగిటివ్ వచ్చింది. గుంటూరు 09, విశాఖ 06, కృష్ణా 05, తూర్పుగోదావరి 4, అనంతపురం 02, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments