కరోనా ఎఫెక్ట్ : 800 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ..
Send us your feedback to audioarticles@vaarta.com
టీటీడీపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా రెండు నెలలకు పైగానే భక్తులకు పూర్తిగా దర్శనం లభించలేదు. జూన్ నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నప్పటికీ భక్తులు కరోనా భయంతో దర్శనానికి వెనుకడుగు వేస్తున్నారు. నిత్యం లక్షల మంది భక్తులతో కళకళలాడుతూ ఉండే దేవస్థానం ప్రస్తుతం భక్తులు లేక వెలవెలబోతోంది. నిత్యం వేల మంది భక్తులు తిరుగుతూ ఉండే మాడ వీధుల్లో కనీసం వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్యలో కూడా భక్తులు కనిపించడం లేదు.
కొండపై పెరుగుతున్న కరోనా కేసులు..
కొండపై కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జీయంగార్ల నుంచి అర్చకుల వరకూ.. మరోవైపు సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సిబ్బందిలో ఒకరు మరణించడం మరింత భయాందోళనకు గురి చేస్తోంది. భక్తుల దర్శనాలను నిలిపివేయాలని కోరుతున్నప్పటికీ టీటీడీ అధికారులు స్పందించకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొండపైకి వెళితే దాదాపు వారం రోజుల పాటు అక్కడే గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఆహారం, మెడికల్‌కు సంబంధించిన ఇతర విషయాల్లో సైతం టీటీడీ శ్రద్ధ వహించడం లేదంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది.
800 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ
ఈ నాలుగు నెలలు కాలంలో టీటీడీ భారీగా ఆదాయం కోల్పోయింది. 90 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు. స్వామివారి దేవస్థానం ఏకంగా 800 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. 3.5 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయాలు తగ్గాయి. 36 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించకూండానే వెళ్లిపోయారు. మొత్తంగా కరోనా కారణంగా టీటీడీకి భారీగా రెవెన్యూ లాస్ అయింది.
తిరుపతిలోనూ పెరిగిన కరోనా కేసులు..
మరోవైపు తిరుపతిలోనూ రోజురోజుకూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 239 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తిరుపతిలో 1753 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క తిరుపతిలోనే ఇప్పటి వరకూ కరోనా కారణంగా 34 మంది మృతి చెందారు. కరోనా కేసులతో విష్ణు శ్రీనివాసం, పద్మావతి నిలయం క్వారంటైన్లు నిండిపోయాయి. అయితే తిరుమలలో భక్తుల దర్శనాలు ప్రారంభమైన నాటి నుంచే తిరుపతిలో కేసులు పెరిగాయని.. కాబట్టి దర్శనాలను నిలిపివేయాలని తిరుమల వాసులు కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments