పవన్ ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి..?

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

పవర్‌స్టార్‌, జ‌న‌సేనాని రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌సాబ్‌’. ముందుగా ఈ చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ భావించారు. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. దీంతో విడుద‌ల తేదీని మార్చుకోవాల్సిన ప‌రిస్థితి క‌న‌ప‌డుతుంది. ఏరోజున విడుద‌ల చేయాల‌ని నిర్మాలు ఆలోచించుకున్నారు. ముందుగా జూలైలో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే క‌రోనా ప్ర‌భావంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలాగానే అనిపించ‌డంతో ‘వకీల్‌సాబ్’ను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి వెళ్లేలా ఉంద‌ని అంటున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. దీంతో దిల్‌రాజు సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. మంచి రిలీజ్ డేట్‌కే ‘వకీల్‌సాబ్’ను తీసుకు రావాల‌ని దిల్‌రాజు అనుకుంటున్నాడ‌ట‌. అందువ‌ల్ల కాస్త ఆల‌స్య‌మైనా ద‌స‌రాకే రావాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేకే ‘వకీల్‌సాబ్’. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.