నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

  • IndiaGlitz, [Friday,April 03 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన 'భీష్మ'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ముందుగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న రంగ్ దే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భీష్మ హిట్ కావ‌డంతో రంగ్ దేకు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ ద‌క్కాయి. ముఖ్యంగా శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల‌కు క‌లిపి ప్ర‌ముఖ జీ ఛానెల్ 10 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌డానికి రెడీ అయ్యింది. అయితే నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రూ.12 కోట్లు కావాల‌నుకున్నాడు. డీల్ 11 కోట్ల‌కు ఓకే అయ్యింది. ఈ సమ‌యంలో క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని ప‌నులు హోల్డ్ ప‌డ్డాయి. దీంట్లో రంగ్ దే బిజినెస్ డీల్ కూడా హోల్డ్‌లో ప‌డింది.

ఈ సినిమా త‌ర్వాత నితిన్ త‌న నిర్మాణంలో బాలీవుడ్ చిత్రం అంధాదున్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. కాగా.. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ చిత్రంలోనూ న‌టించ‌బోతున్నాడు . ఇవీ రెండు కాకుండా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది.

More News

'ఆర్ఆర్ఆర్‌'పై పున‌రాలోచ‌న‌లో దిల్‌రాజు ?

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న

ఎల్లుండి 9 నిమిషాలు నాకివ్వండి : మోదీ

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఓ సారి పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరోసారి దేశ ప్రజలకు వెరైటీ పిలుపునిచ్చారు.

హాట్ స్టార్ తో క్రిష్ డీల్ ?

డైరెక్ట‌ర్ క్రిష్‌ను మ‌ల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క డైరెక్ష‌న్ చేస్తూనే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వ‌హిస్తుంటాడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌న్నింటిలోనూ

మ‌హేశ్ 27లో నిర్మాణం స‌రే.. లాభాలెవరికి ?

సూప‌ర్‌స్టార్ మహేశ్ 27వ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుందనే వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. మ‌హేశ్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్‌

రెండక్ష‌రాల టైటిల్‌తో బ‌న్నీ...?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు.