నితిన్ పెళ్లికి క‌రోనా ఎఫెక్ట్‌

  • IndiaGlitz, [Monday,March 09 2020]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా ఇన్నాళ్లు ఉన్న నితిన్ త‌ర్వ‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే షాలిని రెడ్డితో నితిన్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. 8 ఏళ్లు ప్రేమించిన షాలినితో ఏప్రిల్ 16న నితిన్ దుబాయ్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని అనుకున్నాడు. అయితే ఇప్పుడు నితిన్ పెళ్లిపై క‌రోనా ఎఫెక్ట్ ప‌డేలా ఉంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ కార‌ణంగా నితిన్ డెస్టినేష‌న్ మ్యారేజ్ అనుమానంలో ప‌డింది. దీంతో దుబాయ్‌లో కాక‌పోతే.. హైద‌రాబాద్‌లో అయినా పెళ్లి జ‌రిగేలా నితిన్ ప్లాన్ చేస్తున్నార‌ట నితిన్ ఫ్యామిలీ స‌భ్యులు.

దుబాయ్‌లో కాక‌పోతే హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లోని ఓ పెద్ద ఫామ్ హౌస్‌లో నితిన్ పెళ్లి ఏర్పాటు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పెళ్లి త‌ర్వాత ఏప్రిల్ 21న హైద‌రాబాద్ హైటెక్స్‌లో భారీ లెవ‌ల్లో రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నితిన్ హీరోగా రీసెంట్‌గా భీష్మ సినిమాతో భారీ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రంగ్ దే సినిమాతో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో చెక్ అనే సినిమాను చేయ‌బోతున్నాడు. పెళ్లి త‌ర్వాత ఈ సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయ‌ని టాక్‌.