కరోనా దెబ్బ... రూ.2 కోట్లు నష్టం
- IndiaGlitz, [Monday,July 27 2020]
హీరోగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఈయన హీరోగా చేస్తున్న సినిమాకు కోవిడ్ 19 కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకెళ్లే.. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘రావణ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారట. ఈలోపు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో షూటింగ్‌ను ఆపేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చినా, షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే మన స్టార్స్ ఆలోచనలోపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో కల్యాణ్‌రామ్ సినిమా సెట్ కోసం నిర్మాతలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని దానికి డబ్బులు ఎందుకు కట్టాలని భావించిన నిర్మాతలు సెట్‌ను తొలగించేశారరని సమాచారం. దీని వల్ల నిర్మాతలకు రెండు కోట్ల రూపాయలు ఎక్స్‌ట్రా ఖర్చు అయినట్లు సమాచారం.
మరోవైపు కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ మరో నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.