కరోనా ఎఫెక్ట్.. పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కాగా.. ఏప్రిల్-3న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే.. భారత్‌లో కరోనా వ్యాప్తిచెందుతుండటం.. రోజుకురోజుగా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం.. మరోవైపు అనుమానితులు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా.. అవార్డుల ప్రదానోత్సవం తదుపరి ఎప్పుడనేది ఉత్వర్వులు వచ్చే వరకూ వాయిదా వేశారు. ఈ మేరకు అవార్డు గ్రహితలకు సమాచారం కూడా పంపడం జరిగింది.
పద్మ అవార్డు గ్రహితలు వీరే..
71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని 2020వ సంవత్సరానికిగాను ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని ఈ పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి క్రీడా విభాగంలో పీవీ సింధుకు పద్మ భూషణ్‌ను ప్రకటించగా.. వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ , విద్య-సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు వరించాయి. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యడ్ల గోపాల రావు, దలవాయి చలపతి రావులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments